Telanganapatrika (July 10): ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్, తిప్పాపూర్, మరియు వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా సందర్శించారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు – భక్తులతో సందడి వాతావరణం..
ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా స్వామికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, “గురుపౌర్ణమి రోజు గురువులను పూజించి, వారి సేవను స్మరించుకుంటాం. వారు చూపిన మార్గంలో నడవడమే నిజమైన గౌరవం” అని పేర్కొన్నారు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అలాగే, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించినందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. చివరగా ప్రజలందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, “స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని” ఆయన ఆకాంక్షించారు.
Read More: Read Today’s E-paper News in Telugu