
RRB Technician Recruitment 2025, ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 6238 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 28 జూన్ 2025 నుండి 28 జూలై 2025 వరకు rrbapply.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
విభాగాల వారీగా పోస్టులు
- Technician Grade-I Signal – 183 పోస్టులు (Level-5)
- Technician Grade-III – 6055 పోస్టులు (Level-2)
ఒకే RRB మరియు ఒకే Pay Level కు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకేసారి ఒక్కకంటే ఎక్కువ RRBలకి అప్లై చేస్తే అన్ని అప్లికేషన్లు రద్దు అవుతాయి.
అర్హత వివరాలు
Technician Grade-I Signal:
- B.Sc (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, IT లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్)
- లేదా BE/B.Tech / 3 years Diploma in Engineering
Technician Grade-III:
- 10వ తరగతి + ITI (సంబంధిత ట్రేడ్)
- లేదా 12వ తరగతి (ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్నవారు)
వయోపరిమితి
- Grade-I Signal: 18–33 సంవత్సరాలు
- Grade-III: 18–30 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాల రిలాక్సేషన్
- OBC: 3 సంవత్సరాల రిలాక్సేషన్
ఎంపిక ప్రక్రియ
- CBT (Computer-Based Test)
- మెడికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
CBT ఒక్క దశలోనే నిర్వహించబడుతుంది (పూర్వంలో రెండు దశలుగా ఉండేది).
CBT పరీక్షలో ప్రశ్నల విభజన (Grade-I):
- జనరల్ అవేర్‌నెస్ – 10
- లాజిక్ & రీజనింగ్ – 15
- కంప్యూటర్ బేసిక్స్ – 20
- మ్యాథ్స్ – 20
- బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ – 35
మొత్తం: 100 ప్రశ్నలు – 90 నిమిషాల సమయం
క్వాలిఫై మార్క్స్: General – 40%, OBC/SC – 30%, ST – 25%
నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 1/3 మార్క్ కోత
అప్లికేషన్ ఫీజు
- General/OBC/EWS: ₹500 (CBTకు హాజరైతే ₹400 రీఫండ్)
- SC/ST/Women/EBC/PWD: ₹250 (CBTకు హాజరైతే పూర్తిగా రీఫండ్)
అభ్యర్థులు అప్లై చేసేముందు పూర్తిగా నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్నదేనా అనేది నిర్ధారించుకోవాలి.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!
One Comment on “RRB Technician Recruitment 2025: టెక్నీషియన్ పోస్టులకు 6238 ఖాళీలు – అధికారిక అప్లై లింక్ @rrbapply.gov.in”