
TELANGANA PATRIKA(MAY30) , రెవంత్ రెడ్డి సర్కార్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాలు, బాధలను అర్థం చేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఖతార్ లోని లేబర్ క్యాంప్ లను సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గల్ఫ్ కార్మికులకు ఆత్మ స్థైర్యం నింపుతూ, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.
సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు గురించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేసియా, వారి పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యత, మరియు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ ద్వారా నిరంతర సేవలు అందిస్తోంది. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం వంటి పథకాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఆది శ్రీనివాస్ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సూచనలను రేవంత్ రెడ్డి సర్కార్‌తో పంచుకుని, భవిష్యత్ సమావేశాల్లో వాటిని అమలు చేయాలని తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu