Ration Shop Rice: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన సన్న బియ్యం పంపిణీ అభాసు పాలైంది. రేవంత్ రెడ్డి నాయకత్వం లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున రేషన్ షాపు ల ద్వారా సన్న బియ్యం కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది.ఈ పథకం పట్ల రాష్ట్రం లో తెల్ల రేషన్ కార్డు లు కలిగిన పేదలు ఎంతో సంతోషించారు. కానీ క్షేత్ర స్థాయి లో సన్న బియ్యం పేరు తో రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. అందుకు నిదర్శనం ఈరోజు మా ఇంట్లో వండిన న బియ్యం.బియ్యం వండేటప్పుడు తక్కువ ఎసరు తో వండి నారు.అన్నం ముద్ద గా తయారు అయింది. నేను అన్నం రుచి చూస్తే ఏమంత రుచి గా లేదు. చప్ప గా ఉంది. రేషన్ బియ్యం వాసన వండేటప్పుడు వచ్చింది. ఇచ్చిన బియ్యం లో నాణ్యత లోపించిందా అన్న అనుమానం కలుగుతుంది. లేదంటే ఎక్కడో సన్న బియ్యం పంపిణీ లో గోల్ మాల్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది.కావున ఇప్పుడు పంపిణీ చేసిన బియ్యం ని అధికారులు పరీక్షల కు పంపి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు .లేదంటే ప్రభుత్వానికి ఈ పథకం వల్ల వచ్చే పేరు కన్నా చెడ్డ పేరు అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది.


Also read: Jai Samvidhan Padayatra|జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర
One Comment on “Ration Shop Rice: రేషన్ షాప్ ల్లో సన్న బియ్యం పేరు తో రీసైక్లింగ్ బియ్యం పంపిణీ”