Telanganapatrika (August 13): Rajinikanth Coolie, సినీ ప్రియులంతా ఆగస్టు 14 కోసం కౌంట్‌డౌన్‌లో ఉన్నారు. ఈ గురువారం, బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడానికి రెండు బడా సినిమాలు సిద్ధమవుతున్నాయి – సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ, అలాగే ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రూపొందిన వార్ 2.

ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ రెండూ కంఫీట్‌గా పోటీపడుతున్నాయి. ముఖ్యంగా కూలీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
‘కూలీ’లో ఆల్-ఇండియా స్టార్ కాస్ట్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో,
- రజినీకాంత్
- కన్నడ నుంచి ఉపేంద్ర
- బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్
- మలయాళం నుంచి శోబిన్
- టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున (నెగటివ్ రోల్)
లతో భారీ కాస్టింగ్ ఉంది.
ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కూలీకి భారీ హైప్ ఇచ్చాయి. అనిరుద్ సంగీతం అందించిన ‘మోనికా’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Rajinikanth Coolie రజినీ క్రేజ్ – సెలవులు, టికెట్లు, విరాళాలు
కూలీ రిలీజ్ సందర్భంగా కొన్ని సంస్థలు స్వచ్చందంగా సెలవులు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. సూపర్ స్టార్ అభిమాని అయిన యూనో ఆక్వా కేర్ యజమాని, తమ బ్రాంచ్‌ల్లో (చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం) ఉన్న ఉద్యోగులకు సెలవు ఇచ్చి, ఉచిత టికెట్లు అందించారు.
అంతేకాదు, ఆ రోజు ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, విరాళాలు, ప్రజలకు స్వీట్లు పంచడం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వార్త వైరల్ అవ్వడంతో, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా కూలీ రిలీజ్ రోజున సెలవు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu