తెలంగాణ పత్రిక (APR.22), Poshan Paksham 2025: నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపాన గల రైతు వేదికలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషకాహార లేమి తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పోషణ పక్షం కార్యక్రమం రూపొందించబడింది.

ఈ నెల 8 నుండి 22 వరకు కార్యక్రమాలను నిర్వహించేలా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గర్భిణీలు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లల ఆరోగ్య సంరక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఆరోగ్యానికి సంబంధించి నిపుణులతో సలహాలు అందించేలా కార్యక్రమాన్ని చేపట్టారు. సీడీపీఓ మధురిమ మాట్లాడుతూ… అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీల మొదలు బాలింతల ఆరోగ్యాల కోసం అదనంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు, పిల్లలు, కౌమార బాలికలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో సూచన ప్రాయంగా వివరించారు. అనంతరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలు మొదటి నుండీ పౌష్టికాహారం తీసుకోవాలని గుర్తు చేశారు. జననం తర్వాత మొదటి వెయ్యి రోజులకు బలమైన ఆహారం అందించాలన్నారు. ఇది తల్లీ బిడ్డలకు మంచిదన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ముందు నుండే బలవర్ధక ఆహారం తీసుకోవాలన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని గుర్తు చేశారు. చిరు ధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్ భావన మాట్లాడుతూ… గర్భిణీలు మెంటల్ స్ట్రెస్ అసలే పెట్టుకోవద్దన్నారు. రోజూ వాకింగ్ చేయాలన్నారు. ప్రతీ దానికి మెడిసిన్ ఉండదని గుర్తు చేశారు. ఆకుకూరలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలన్నారు. చిన్న పిల్లల్లో దృష్టి సమస్య ఎక్కువగా వస్తుందని, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, టీవీలు , మొబైల్స్ ని సాధ్యమైనంత వారికి దూరం చేయాలన్నారు. బయట తినే ఫుడ్ తో ఆరోగ్యం క్షీణీస్తోందన్నారు. రక్త హీనతకు సరిగ్గా తినకపోవడం కారణం అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నారు. సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని, మిల్లెట్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలన్నారు.

అనంతరం ప్రీ స్కూల్ కార్యక్రమాలు నేర్చుకుని ప్రాథమిక పాఠశాలకు సిద్ధమైన పిల్లలకు, గ్రాడ్యుయేషన్ డే, పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం లు కవిత, సునీత, సూపర్వైజర్స్ రమ, రాధ, జయరాణి,మాధవి, నజ్మా, భాగ్యమ్మ,అరుణ,హేమలత, పారిజాతం, వాసంతి,అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, ప్రాజెక్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాధ,శిరీష, సూపర్వైజర్స్, బీసీ శ్రీలత,టీ.ఎల్.ఎఫ్ అధ్యక్షురాలు నీరజ, టీ.ఏ.ఎఫ్ ఆఫీస్ బేరర్స్, ఆర్పీలు, ఆశా కార్యకర్తలు, తల్లులు , ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ మండల సెక్టార్ లీడర్స్, అంగన్వాడి టీచర్స్, పెద్ద సంఖ్యలో తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu