Ponnam Prabhakar: యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు RTA మెంబర్ సంగీతం శ్రీనాథ్ గారి అధ్యక్షతన రాష్ట్ర రవాణా మరియు బీ.సీ . సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జన్మదినాన్ని పునస్కరించుకొని పట్టణం లోని సివిల్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు..
ఈ సందర్భంగా సంగీతం శ్రీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొన్నం అన్న సేవలను కొనియాడారు. ఎంతో మంది యువ నాయకులకు ఆయన స్ఫూర్తిదాయకం అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు యువజన కాంగ్రెస్ నాయకులకు NSUI నాయకులకు అనునిత్యం వెన్నంటే ఉంటారని ఆయన నాయకత్వం లో పనిచేస్తాము అన్నారు.


ఉద్యమ నాయకుడికి ఉద్యమ గడ్డ సిరిసిల్ల లో గనముగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులుజిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొప్ప దాము సిరిసిల్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల దేవరాజు రెడ్డి,ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ పొత్తూరి శివ, దుద్దడ భాను చిందం శ్రీనివాస్, పైసా ఆంజనేయులు, సబ్బని వేణు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
Read More: Operation Sindhoor Support Rally Rajanna Siricilla: భారత త్రివిధ దళాలకు న్యాయవాదుల మద్దతు