
TELANGANA PATRIKA (MAY17) , Ponguleti srinivasa reddy: పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
ponguleti srinivasa reddy కి వినిపించిన పెన్షనర్ల సమస్యలు
శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో భూభారతి సదస్సుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి,పట్టు శాలువాలతో సన్మానించి పెన్షనర్స్ సమస్యలను విన్నవించారు.పెండింగ్ డి.ఏ.లు,పెన్షనర్స్ కు రిటైర్మెంట్ ప్రయోజనాలు,ఈ.హెచ్.ఎస్.అమలు,సీ.పి.ఎస్.రద్దు,పెండింగ్ బిల్లుల చెల్లింపులు తదితర సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు.మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఐ.ఏ.ఎస్.అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ టి.పి.సి.ఏ. రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,గౌరవ సలహాదారు కే.కృష్ణా రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,తదితరులు పాల్గొన్నారు.
Also Read : నిజామాబాద్ అల్ప్రాజోలమ్ తరలిస్తూ పట్టుబడ్డ ముఠా – విలువ రూ.25 లక్షలు!
Comments are closed.