Telanganapatrika (July 15) : Polytechnic Full Fee Reimbursement 2025 – పాలిటెక్నిక్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి వరం.
Join WhatsApp Group
Join Now

Polytechnic Full Fee Reimbursement 2025.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ
పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు విద్యార్థులకు వరం
మొదటి విడత సీట్లు పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేయించుకోవాలి
- నంగునూరు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో మొదటి విడత సీటు పొందిన విద్యార్థులకు వారి ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రాయితీ ఇస్తుందని సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట పాలిటెక్నిక్ ప్రధానాచార్యుడు, పాలిసెట్-2025 కౌన్సెలింగ్ రాజగోపాలపేట హెల్ప్ లైన్ కేంద్రం సమన్వయకర్త అలుగోజు గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు.
- ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, సాంఘిక సంక్షేమ, తెలంగాణ మోడల్ స్కూల్, విద్యా శాఖచే నిర్వహించబడే రెసిడెన్షియల్ పాఠశాలలలో చదివిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడానికి అర్హులని చెప్పారు.
- తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన ధృవీకరణ, అర్హత ప్రమాణాలకు లోబడి, సమీపంలోని టీజీ పాలిసెట్-2025 హెల్ప్ లైన్ సెంటర్ సంప్రదించి వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ హాజరైన రసీదుతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన బోనాఫైడ్ సర్టిఫికెట్లతో హెల్ప్ లైన్ కేంద్రంలో ఈనెల 18వ తేదీలోగా అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు.
అప్డేట్ చేయించుకున్న అభ్యర్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య, సర్టిఫికేషన్, మరియు ప్రభుత్వ విద్యా పథకాలపై మరింత సమాచారం కోసం అధికారిక లింకులు:
- తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ (Higher Education Department) : https://hed.telangana.gov.in
- తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Telangana) : https://www.cm.telangana.gov.in
- Board of Technical Education Telangana (పాలిటెక్నిక్ విద్యా బోర్డు) : https://sbtet.telangana.gov.in