PM YASASVI Scholarship 2025 : కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, ఈబీసీ మరియు డీనోటిఫైడ్ ట్రైబల్ (డీఎన్టీ) వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి “ప్రధాన మంత్రి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (PM YASASVI)” స్కాలర్షిప్‌ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద 9వ నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.75,000 నుండి రూ.1,25,000 వరకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు మరియు ఇతర విద్యా ఖర్చులకు స్కాలర్షిప్ అందజేస్తారు.

ఈ స్కాలర్షిప్ కేవలం ప్రభుత్వం ఎంపిక చేసిన ‘టాప్ క్లాస్ స్కూల్స్’లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థ పాఠశాలలు, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఉండవచ్చు.
స్కాలర్షిప్ మొత్తం:
- 9వ & 10వ తరగతి: సంవత్సరానికి రూ.75,000 వరకు
- 11వ & 12వ తరగతి: సంవత్సరానికి రూ.1,25,000 వరకు
అర్హత ప్రమాణాలు:
- ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
- గత తరగతిలో ఉన్నత మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
- వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- వయస్సు: 13 నుండి 18 సంవత్సరాల మధ్య ఉండాలి (9వ నుండి 12వ తరగతి విద్యార్థులు).
అవసరమైన పత్రాలు:
- కుల ధృవపత్రం
- ఆదాయ ధృవపత్రం
- గత తరగతి మార్కుల మెమో
- ఆధార్ నంబర్
- విద్యార్థి బ్యాంక్ ఖాతా వివరాలు
- పాఠశాల నోడల్ ఆఫీసర్ ధృవీకరణ
దరఖాస్తు విధానం:
- విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (nsp.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- పాఠశాల నోడల్ ఆఫీసర్ దరఖాస్తును ధృవీకరిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్ధారిస్తుంది.
- రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాలు తయారవుతాయి.
- ఎంపికైన వారికి స్కాలర్షిప్ ఆటోమేటిక్‌గా కేటాయించబడుతుంది.
PM YASASVI Scholarship 2025 ముఖ్యమైన తేదీ:
- దరఖాస్తు చివరి తేదీ: 31 ఆగస్ట్ 2025
గమనిక: మొత్తం స్కాలర్షిప్లలో 30% అమ్మాయిలకు కేటాయిస్తారు.