Telanganapatrika (July 08): PJTAU , ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్‌ను మంగళవారం ప్రారంభించింది. మొదటి సీటును శ్రీ వర్ధన్‌కు కేటాయించి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సి.హెచ్ విద్యాసాగర్ అధికారికంగా కౌన్సిలింగ్‌కు శ్రీకారం చుట్టారు.

PJTAU కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
- డీన్ ఆఫ్ అగ్రికల్చర్ & డైరెక్టర్ ఆఫ్ పాలిటెక్నిక్స్ – డా. కె. ఝాన్సీ రాణి
- డీన్ ఆఫ్ PG స్టడీస్ – డా. కె.బీ. ఈశ్వరి
- డీన్ ఆఫ్ అగ్రి. ఇంజినీరింగ్ – డా. కె.వి. రమణారావు
- కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – డా. ఎం. మల్లారెడ్డి
- ప్రొఫెసర్ & OSD – డా. శ్రవణ్ కుమార్
- రాష్ట్ర SC, ST, BC సంక్షేమ శాఖల అధికారులు, విశ్వవిద్యాలయ సిబ్బంది
ఎలిజిబిలిటీ & కోర్సులు
ఈ కౌన్సిలింగ్ ద్వారా వివిధ అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రి ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల నుండి అధికారులు హాజరుకావడం గమనార్హం.
Read More: Read Today’s E-paper News in Telugu