కార్యదర్శులు ఉన్న నిధులు ఖాళీ !?
Pentlam Panchayat Issues 2025, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లోని పెంట్లం గ్రామ పంచాయతీ నిధులు లేకపోవడంతో వీధిలైట్లు వేసే పరిస్థితి లేక గత కొన్ని రోజులుగా అంధకారంలోనే ఉంటూ అరణ్య రోదన వినిపించిన పట్టించుకున్న నాథుడు లేడని తెలుస్తుంది వీధిలైట్లు లేక విష్ణు సర్పాలు సైతం జన ఆవాస ప్రదేశాలకు రావడంతో గ్రామంలో ప్రజలు బీబేలు పెడుతున్నారు. గత కొంతకాలంగా సర్పంచుల కాలం ముగియడంతో అభివృద్ధి పనులు పడకేసేయని పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నప్పటికీ నిధులు లేక గ్రామాలు అంధకారంలో తలపిస్తున్నాయని పెంట్లం గ్రామంలో అరకోరి పనుల సైతం నత్తనడగా కొనసాగుతున్నాయని భారీ స్థాయిలో విమర్శలు లేకపోలేదు. పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయవలసిన నిధులు అందక పంచాయతీలో పారిశుద్ధం పనులు సైతం పడకేసినట్లు ఆయా గ్రామస్తులు మండిపడుతున్నారు.

పంచాయతీ కార్యదర్శులు ఉన్న పనులంతా నత్త నడకే !
పెంట్లం గ్రామంలో చీకటి పడితే చాలు వీధిలైట్లు లేక వెలగక అంధకారంలో ఉంటున్నామని విశ్వసర్పాలు సైతం గ్రామాలలోకి చుచ్చుకొని వస్తున్నాయని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో గ్రామ ప్రజలు ఉన్నట్లు గిరిజన గ్రామాల ప్రజల వాపోతున్నారు.
సర్పంచుల కాలం ముగియడంతో అభివృద్ధి నీల్ ?
తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలం సర్పంచ్ల కాలం ముగియడంతో పంచాయతీలోని పనులు సైతం నడిపించే పరిస్థితి లేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించినప్పటికీ నిధులు లేకపోవడంతో అధికార యంత్రాంగం సైతం అంటి అంటున్నట్లుగా ముట్టుముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఇటువంటి పరిస్థితులలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేకుండా పోతుందని కార్యాలయాలు చుట్టూ తిరగలేక అలసి తులసి విష సర్పాలతోనే కాలం గడిపేస్తున్నామని గ్రామస్తులు సైతం వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పెంట్లం గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని తక్షణమే వీధిలైట్లు వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి