Telanganapatrika (August 17): సీఎంతో పీసీసీ చీఫ్ కీలక భేటీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ ఉదయం భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, PAC సమావేశంపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం.

భేటీ ప్రాధాన్యం
ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉన్న సందిగ్ధత
కోర్టు విధించిన ఎన్నికల గడువు దగ్గరపడటం
ఈ భేటీకి మరింత ప్రాధాన్యత తెచ్చిపెట్టాయి.
PAC సమావేశంపై చర్చ
ఇద్దరూ ప్రధానంగా PAC సమావేశం తేదీ ఖరారు అంశంపై చర్చించారు.
PAC సమావేశం ద్వారా ఎన్నికల నిర్వహణపై ఒక క్లారిటీ రావొచ్చని భావిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకోవడంలో ఇది కీలకంగా మారనుంది.
సీఎంతో పీసీసీ చీఫ్ కీలక భేటీ నేపథ్యం
ఇప్పటికే కోర్టు, స్థానిక సంస్థల ఎన్నికలకు డెడ్‌లైన్ విధించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం – కాంగ్రెస్ నేతలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read More: Read Today’s E-paper News in Telugu