తెలంగాణ పత్రిక, వెబ్డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2000 నుండి 2015 మధ్య కాలంలో డిగ్రీ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ లాగ్స్ ఉన్న వారికి వన్ టైం ఛాన్స్ కింద పరీక్షలు రాసే అవకాశం కల్పించింది యూనివర్సిటీ.
OU ONE TIME CHANCE DEGREE EXAMS DATES
ఈ పరీక్షలను సెప్టెంబర్ 9 నుండి నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ అవకాశం కోల్పోయిన విద్యార్థులకు చివరి ఛాన్స్ లాగా ఉండనుంది.

పరీక్షలకు సంబంధించిన ఫీజులను విద్యార్థులు తమ కళాశాలలో లేదా ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో చెల్లించవచ్చు.
ఈ ప్రక్రియ ద్వారా డిగ్రీ పూర్తి చేయకుండా ఉన్న వారందరికీ అవకాశం లభిస్తుంది. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు, సమయం, సెంటర్లు త్వరలో విడుదల చేయనున్నారు.
విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్ లేదా యూనివర్సిటీ అధికారులతో సంప్రదించి సమాచారం సేకరించడం మంచిది.