OTT Subscription Scam: సోషల్ మీడియా మరియు స్మార్ట్ఫోన్ వాడకం పెరుగుతున్న క్రమంలో, సైబర్ నేరగాళ్లు కొత్త రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ఫారమ్స్ కు సంబంధించిన ఫేక్ సబ్ స్క్రిప్షన్ ఆఫర్లు ద్వారా వారు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు.

OTT Subscription Scam ఏం జరుగుతోంది?
ఈ స్కామ్ లో:
సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ప్రకటనలు, ఎస్ఎమ్ఎస్ లు, ఫిషింగ్ వెబ్ సైట్లు ఉపయోగిస్తున్నారు.
వారు “ఐదేళ్ల సభ్యత్వం, జీవితకాల యాక్సెస్” లేదా “రూ.99 కు ప్రీమియం అకౌంట్” వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నారు.
ఈ ఆఫర్లపై క్లిక్ చేసిన వారిని ఒక ఫేక్ వెబ్ సైట్ కు దారి మళ్లుస్తారు.
స్కామ్ ఎలా పనిచేస్తుంది?
స్కామర్స్ క్రింది విధంగా బాధితుడిని నమ్మించి డబ్బు దొంగిలిస్తారు:
ఫేక్ వెబ్ సైట్ లో, బాధితుడిని తన క్రెడిట్/డెబిట్ కార్డ్ డీటైల్స్ నమోదు చేయమని అడుగుతారు.
డీటైల్స్ నమోదు చేసిన వెంటనే, అసలైన ఖాతా ఏర్పడదు.
స్కామర్స్ కార్డ్ డీటైల్స్ ను దొంగిలించి, అక్రమ లావాదేవీలు చేస్తారు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముతారు.
హెచ్చరిక సందేశం
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు:
అసాధ్యం అనిపించే ఆఫర్లకు నమ్మకం ఉంచకండి.
అధికారిక ఓటీటీ యాప్ లు లేదా వెబ్ సైట్ల నుండి మాత్రమే సబ్స్క్రిప్షన్లు కొనండి.
లింక్ లపై క్లిక్ చేయకముందు URL ని జాగ్రత్తగా పరిశీలించండి.
ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ స్టేట్మెంట్ లను తనిఖీ చేయండి.
Read More: Read Today’s E-paper News in Telugu
