Oracle layoffs 2026: ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ కంపెనీ Oracle ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఈసారి కారణం కొత్త టెక్నాలజీ కాదు… భారీ లేఆఫ్స్ వార్త. తాజా సమాచారం ప్రకారం, Oracle సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు దిగింది. దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ నిర్ణయం కంపెనీ రీస్ట్రక్చరింగ్ భాగంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వ్యాపార అవసరాలకు అనుగుణంగా సంస్థ తన నిర్మాణాన్ని మార్చుకుంటోందని కంపెనీ పేర్కొంది.
ఉద్యోగులకు పంపిన నోటిఫికేషన్ మెయిల్స్‌లో, “కంపెనీ అవసరాల దృష్ట్యా మీ రోల్‌ను తొలగిస్తున్నాం” అని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వనున్నట్లు కూడా తెలియజేశారు.
Oracle layoffs 2026 Oracle లేఆఫ్స్ మరో అలజడి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్న నేపథ్యంలో, Oracle తీసుకున్న ఈ నిర్ణయం మరింత చర్చకు దారి తీసింది. పెద్ద కంపెనీలు ఉద్యోగాల కోతకు దిగడం మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది.
ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ, జియోపాలిటికల్ పరిస్థితులు, ఖర్చుల తగ్గింపు చర్యలు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిణామం వల్ల వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. అలాగే టెక్ రంగంలో పనిచేస్తున్నవారిలో ఆందోళన పెరిగింది.
Read More: Read Today’s E-paper News in Telugu
