Telanganapatrika (August 20): Online Bettting Ban in India, దేశంలో ఆన్లైన్ బెట్టింగ్, మనీ బేస్డ్ గేమింగ్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.

Online Bettting Ban in India మనీ బేస్డ్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్‌పై నిషేధం
బిల్లు చట్టరూపం దాల్చితే, మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ పూర్తిగా నిషేధం కానున్నాయి. ఇకపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ తరహా ఆన్లైన్ గేమ్స్‌కు ఫండ్ ట్రాన్సఫర్ చేయవు. దీంతో గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బు కోల్పోతున్న యువతకు కొంత ఉపశమనం కలిగే అవకాశముంది.
J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు కూడా సిద్ధం
ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో పాటు J&K పునర్వ్యవస్థీకరణ బిల్లునూ ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి. రెండు బిల్లులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu