Telanganapatrika (July 17) , NoEntry Violation Trucks , కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని పగలు రాత్రి తేడా లేకుండా లారీలు, డీసీఎంలు అనుమతి లేని సమయంలో అధిక లోడ్ తో వెళుతున్నాయి. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు.

NoEntry Violation Trucks నియంత్రణ కోల్పోవడం…
ఇక ఈ మధ్య నియోజకవర్గంలోని పలుమార్లు భారీ వాహనాలు వచ్చి అదుపు తప్పి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పలువురు అమాయకులు సైతం ఈ వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. టిప్పర్లల్లో కంకర, డస్ట్‌ను వాహన సామర్థ్యానికి మించి లోడ్‌చేసి తరలిస్తుండటంతో తారు రోడ్లు గుంతలు పడి చెడిపోతున్నాయి. కంకర, డస్ట్ తరలించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో వాహనం వెనకాల వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లల్లో డస్ట్ పడి కిందపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. 20 నుంచి 30 శాతం వాహనాలు అధిక లోడ్ తో వెళ్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఓవర్ లోడ్ ట్రక్కులు స్పీడ్ గా వెళ్ళినప్పుడు ట్రైలర్ అదుపుతప్పి ఫిష్ టైలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. ఓవర్ లోడ్ ట్రక్కులు బ్రేక్ వేయడానికి ఎక్కువ దూరం అవసరం సరైన సమయంలో బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవర్ లోడ్ వలన అదుపుతప్పి ఇతర వాహనాలను డీ కొట్టే ప్రమాదం కూడా ఉంది.
NoEntry Violation Trucks దుమ్మూ ధూళితో తీవ్ర అవస్థలు…
ఉదయం పూట భారీ వాహనాల వలన వెనకనుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులకు దుమ్మూ ధూళితో అవస్థలు పడుతున్నారు. పాదాచారులు శ్వాస సమస్యలతో చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన కరువైందని వాపోయారు. వ్యాపార దుకాణాల్లో ద్విచక్ర వాహనదారులకు కంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
సమయపాలన లేకుండా…
ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా సమయపాలన లేకుండా వెళ్తుండడంతో జీడిమెట్ల, సూరారం, బాచుపల్లి, గండిమైసమ్మ చౌరస్తాలలో ట్రాఫిక్ జామ్ అవడమే కాకుండా వ్యాపార దుకాణాల్లో, ద్విచక్ర వాహనదారులకు కంటి చూపు సమస్యలు ఎదురవుతున్నాయి.
NoEntry Violation Trucks ఓవర్‌లోడ్‌తో రోడ్లపైకి వాహనాలు.. తారు రోడ్లు ధ్వంసం…
సామర్థ్యానికి మించి అధిక లోడ్‌తో వాహనాలు రోడ్డుపై వెళ్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తారు రోడ్లు సైతం ధ్వంసమవుతున్నాయి. టిప్పర్లలో సామర్థ్యానికి మించి కంకర, డస్ట్ లోడ్ చేసి తరలించటం వల్ల తారు రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలు పడి ధ్వంసమవుతున్నాయి.కంకర, డస్ట్ తరలించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో వాహనం వెనకాల వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లల్లో డస్ట్ పడి కిందపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ల వద్ద కంకర కుప్పలు కుప్పలుగా పడి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా ఖర్చులు తగ్గించేందుకు మరియు ఒకేసారి ఎక్కువ కంకర, డస్ట్ తరలించాలన్న దురాశతో టిప్పర్లలో వాహన సామర్థ్యానికి మించి లోడ్ వేస్తుండటంతో రోడ్లపై నిత్యం ట్రాఫిక్ అంతరాయాలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం…
ఇంత జరుగుతున్నా ఆర్ టీ ఏ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వాహనాలు, లారీలు డీసీఎంల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటలలోపే ఇవి సిటీలోకి ప్రవేశించాలి. అయినా ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడు పడితే అప్పుడు దూసుకొస్తున్నారు. ఈ ఉల్లంఘన పై నో ఎంట్రీ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ 1000 రూపాయల చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళల్లో ప్రవేశించి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు.
దీనిని చూపిస్తూ రోజంతా సిటీ చుట్టేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతీ జంక్షన్ లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయట్లేదు. మరోపక్క ఇలాంటి నో ఎంట్రీ వాహనాలను స్వాధీనం చేసుకునే ఆస్కారం పోలీసులకు సైతం ఉంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతి సమయంలో తిరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu