Advertisement

Nirmal Sanitation Drive : వర్షాకాలం ముందస్తు ఏర్పాట్లు – ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ఆదేశించిన అదనపు కలెక్టర్ ఫైజాన్

TELANGANA PATRIKA(JUN 3) , Nirmal Sanitation Drive , నిర్మల్ జిల్లా వర్షాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జూన్ 2 నుండి జూన్ 6 వరకు నిర్వహించబడుతోంది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ప్రజారోగ్య పరిరక్షణకు సమన్వయంతో చర్యలు

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో నిమగ్నమైన ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని, బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు.

Advertisement

Nirmal Sanitation Drive సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు

మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రాధాన్యత గల ప్రాంతాల్లో డ్రెయిన్‌లు పూర్తిగా శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ స్ప్రే చేయాలనీ ఆదేశించారు.

శానిటేషన్ కార్మికుల సంక్షేమం
శానిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, పని ప్రమాణానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

Nirmal Sanitation Drive ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు

గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజల్లో శుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

విద్యా సంస్థల పునః ప్రారంభానికి ఏర్పాట్లు
పాఠశాలలు, హాస్టళ్లు, ఆంగన్‌వాడీ కేంద్రాల పునః ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు, బడి బాట కార్యక్రమం, చిన్న మరమ్మత్తులు, యూనిఫాం కుట్టింపు, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై మండలాల వారీగా చర్చించారు.

వనమహోత్సవం ఏర్పాట్లు
వనమహోత్సవంలో భాగంగా మొక్కల నాటేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జడ్పీ సిఈ ఓ గోవింద్, పి డి డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, డి పి ఓ శ్రీనివాస్, డి ఈ ఓ రామారావు, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →