Telanganapatrika (June 13): Nirmal jilla news, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ఇంకా మూఢ నమ్మకాలను సమాజం విడనాడడం లేదనేదానికి మరో ఉదాహరణే ఈ ఉదంతం. మూఢ విశ్వాసాలతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం లోకేశ్వరం మండలంలో సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు (64) తమ కుటుంబంపై మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన గడ్డం, గంగాధర్,గడ్డం సాయిలు ఇద్దరు సోదరులు గత కొంతకాలంగా పోసులపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం తమ కూతురు, అలాగే రెండు నెలల క్రితం గంగాధర్ యొక్క రెండు ఆవులు చనిపో*వడంతో పాటు తమతల్లి లక్ష్మి అనారోగ్యానికి గురవడంతో వీటన్నిటికీ కారణం పోసులు చేసిన చేతబడే అని వారు నమ్మి ఎలాగైనా గడ్డం పోసులును అంతం చేయాలని నిర్ణయించుకుని పతకం ప్రకారం గురువారం ఉదయం పోసులు తన పొలానికి వెళ్తున్న క్రమంలో నగర్ గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో గడ్డం సాయిలు, గంగాధర్లు కాపు కాచి.
Nirmal jilla news ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్

వెంట తెచ్చుకున్న సిమెంట్ ఇటుకలతో తలపై విచక్షణ రహితంగా బాధి హత్య చేశారు. హ*త్యకు గురైన వ్యక్తి హ*త్య చేసినవారికి సమీప బందువే అవ్వటం గమనార్హం. వెంటనే సమాచారం అందుకున్న బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, ఎస్సై అశోక్ లు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని మృతుని కుమారుడు గడ్డం సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!