Telanganapatrika (August 19): NDA Vice President, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి ఎంపిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది. విపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని రంగంలోకి దింపడం ద్వారా NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పార్టీలైన TDP, YSRCP, BRS దృష్టిలో ఈ ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా విపక్షాలు కొత్త రాజకీయ లెక్కలు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం వల్ల ప్రాంతీయ పార్టీలకు తటస్థంగా ఉండటం కష్టసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
NDA Vice President సుదర్శన్ రెడ్డి-చంద్రబాబు సంబంధం..
ఇక బి. సుదర్శన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా ఉండటం మరో ప్రధాన అంశంగా మారింది. ఈ కారణంగా TDP స్థానం కీలకమైపోగా, ఇతర విపక్షాల వ్యూహాలు కూడా ఈ పరిణామంపై ఆధారపడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu