Telanganapatrika (July 11): Nalgonda SP , చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు. జిల్లా ఎస్పీ శర చంద్ర పవర్ వెల్లడించిన ప్రకారం: జూలై 4వ తేదీన చండూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మారగోని బుచ్చమ్మ/బాదితురాలు మధ్యాహ్నం అందాజ 02 గంటల సమయంలో తన చెల్క దగ్గరినుండి ఇంటికి నడ్చుకుంటూ వస్తుండగా గొల్లగూడెం గ్రామంలో బాదితురాలి దగ్గరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి, వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ దిగి బాదితురాలితో ఇడికుడకు దారి ఎటు అని అడుగుతూ మాటల్లో పెట్టి బాదితురాలి మెడలో ఉన్న 03 తులాల పుస్తేల తాడును లాక్కొని వెళ్ళినాడు. ఇట్టి విషయం పై చండూర్ పోలీసు స్టేషన్ లో బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది.

Nalgonda SP బంగారు గొలుసుల వేట… కానీ ఈసారి చిక్కారు!
Nalgonda SP జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ సూచనల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నాలుగు టీమ్ లుగా ఏర్పడి చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 11వ తేదీన ఉదయం 07.30 గంటల సమయంలో నిందితులను తాస్కానిగూడెం శివారులో వాహనాలు తనికి చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించగా వారిని పట్టుబడి చేసి విచారించగ నేరస్తులు, చెడు వ్యసనాలకు బానిసై మరియు కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల వలన చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలోనే గొల్లగూడెం,వాడపల్లి ,కల్లేపల్లి,పెన్ పహాడ్,అనాజీపురం, లింగాల, దోసపహాడ్,వేములపల్లి, బీరెల్లిగూడెం ,నకిరేకల్,చందుపట్ల,మర్రూరు గ్రామంలో నేరస్తులు అయిన ఏ-1 రావిరాల పవన్, ఏ-2 రావిరాల రాజు లు ఒక్కోసారి ఒక్కో బైక్ మారుస్తూ మొత్తం 04 మోటార్ సైకిళ్ళ లను ఉపయోగించి ఒంటరిగా వెళ్ళే మహిళలనే టార్గెట్ చేస్తూ వారితో మాటలు కలిపి వారి మెడలో ఉన్న బంగారం పూస్తేల తాడు/గొలుసులు లాక్కొని బైక్ పై పారిపోయేవారు, వారి ఒప్పుకోలు ప్రకారంగా వారి నుండి 19.5 తులాల 08 బంగారు పూస్తేల తాడులు (విలువ 19 లక్షలు), 02 సెల్ ఫోన్లు మరియు దొంగతనం చేయడానికి ఉపయోగించిన 04 మోటార్ సైకిళ్ళ లను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరములు :
ఏ-1 రావిరాల పవన్(28)గ్రామము నీలాయిగూడెం గ్రామం, త్రిపురారం మండలము,
ఏ-2. రావిరాల రాజు(26)నీలాయిగూడెం గ్రామం, త్రిపురారం మండలము,ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు.గతంలో నిందితులపై వాడపల్లి, పెన్ పహాడ్, వేములపల్లి, చండూరు, నకిరేకల్ పోలీస్ స్టేషన్లో గతంలో వివిధ శిక్షణ కింద కేసు నమోదు.నేరస్తుల వద్ద నుండి 08 బంగారు పూస్తేల తాడులు, బరువు 19.5 తులాలు, వాటి మొత్తం విలువ 19 లక్షలు,04 మోటారు సైకిళ్లు, 02 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.ఇట్టి కేసును త్వరితగతిన చేదించిన నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, చండూర్ సీఐ కె. అది రెడ్డి,చండూర్ ఎస్‌ఐ యన్. వెంకన్న, కనగల్ యస్.ఐ విష్ణు మూర్తి, స్టేషన్ సిబ్బంది ఉపేంద్ర చారి, శ్రీకాంత్, కార్తీక్, హరున్, నగేష్, అనిల్, ఖలీల్, రమేష్, నరేందర్ లను నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ అభినందించారు.
Read More: Read Today’s E-paper News in Telugu