Municipal Elections Congress Strategy Telangana: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి ఆందోళన మొదలైంది. అంతర్గత సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల కంటే వెనుకబడుతోందని, ముఖ్యంగా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న అంచనాలు రావడంతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం తన మంత్రివర్గంతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ కీలక భేటీలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Municipal Elections Congress Strategy Telangana సర్వేల్లో ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలహీనంగా?
సమావేశంలో చర్చించిన కనీసం నాలుగు అంతర్గత సర్వేలు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ , ఉమ్మడి మెదక్ ,ఉమ్మడి నిజామాబాద్ ,ఉమ్మడి కరీంనగర్ ,మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు లో పార్టీ బలహీనంగా లేదా వెనుకబడినట్లు తేలినట్లు తెలుస్తోంది.
మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని
విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని రోజువారీగా గ్రౌండ్ రిపోర్టులు సమర్పించాలని సూచించారు.
తిరుగుబాటు అభ్యర్థులపై ఫోకస్
టికెట్ల పంపిణీపై అసంతృప్తితో ఉన్న తిరుగుబాటు అభ్యర్థులను ఒప్పించే బాధ్యతను కూడా మంత్రులకే అప్పగించారు. వారి వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
గ్రామపంచాయతీ ఫలితాల ప్రభావం
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో, పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రచారం మరింత వేగం పుంజుకునే అవకాశం రాజకీయ వేడి మరింత పెరగనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
