Telanganapatrika (August 20): Mulugu paddy crop loss, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన ఓ మహిళా రైతు కష్టపడి వేసిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. వరద ప్రవాహం కారణంగా పొలంలో ఇసుక మేటలు ఏర్పడి పంట పూర్తిగా నష్టపోయింది.

Mulugu paddy crop loss 20 ఎకరాల్లో పంట నష్టం
సుమారు 20 ఎకరాల పొలంలో సాగు చేసిన వరి పంట ఒక్కసారిగా వరదల ముప్పుకు గురైంది. పొలం అంతా ఇసుకతో కప్పబడటంతో పంట నిలువలేకపోయింది. లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసినా, అన్నీ వృథా అయ్యాయని రైతు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సహాయం కోరుతున్న రైతులు
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణమే పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సాయం అందించాలన్నది వారి డిమాండ్.
Read More: Read Today’s E-paper News in Telugu