Telanganapatrika (June 15 ): MP Raghunandan Rao, సంగారెడ్డి జిల్లా, ఐడిఏ బొల్లారం పోలీసు స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన లోక్ సభ ఎంపీ రఘునందన్ రావ్, స్థానికి ఎం.ఎల్.ఎ. గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.ఎల్.సి అంజిరెడ్డి
సంగారెడ్డి కాంసెన్సీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్టీ జోన్-II ఐజి వి.సత్యనారాయణ, ఐపిఎస్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ హెటిరో ల్యాబరేటరి డైరెక్టర్ మోహన రెడ్డి, యాజమాన్యం.

ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిదిలో గౌరవ లోకసభ ఎంపీ రఘునందన్ రావ్, స్థానికి ఎం.ఎల్.ఎ. గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.ఎల్.సి అంజిరెడ్డి చేతుల మీదుగా ఐడిఏ బొల్లారం నూతన పోలీసు స్టేషన్ భవనానికి భూమి పూజ/ శంకుస్థాపన చేయడం జరిగిందని పటాన్ చెర్వు డియస్పీ ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. హెటిరో ల్యాబరేటవరి సంస్థ సుమారు రూపాయలు 3.5 కోట్ల వ్యయంతో కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించే విధంగా, అధునాతన హంగులతో బొల్లారం పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఈ నూతన పోలీసు స్టేషన్ భవనం అవుట్ రింగ్ రోడ్డు కు అతి సమీపంలో ఉండటం వలన స్టేషన్ పరిదిలో గల అన్నీ గ్రామాలకు సులువుగా చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్టీ జోన్-II ఐజి వి.సత్యనారాయణ, ఐపిఎస్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ . హెటిరో ల్యాబరేటరి డైరెక్టర్ మోహన రెడ్డి, బొల్లారం యస్.హెచ్.ఓ రవీందర్ రెడ్డి, సబ్-డివిజన్ ఇన్స్పెక్టర్స్ మరియు హెటిరో ల్యాబరేటరి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!