Telanganapatrika (August 20): తల్లే పిల్లల ప్రాణం తీశిందా..? జన్మనిచ్చిన తల్లే రక్షణగా ఉండాలి. కానీ బాచుపల్లి పరిధిలో తల్లే ప్రాణహంతకిగా మారింది. లక్ష్మీ అనే మహిళ తన ఎనిమిది నెలల పసిబిడ్డను, మూడేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఉన్న సంపులో పడేసి హతమార్చిన హృదయ విదారక ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన స్వంత పిల్లలను సంపులో పడేసి ప్రాణాలు తీసింది. ఎనిమిది నెలల బిడ్డ, మూడేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా సంపులో పడేసిన తల్లి, అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

స్థానికుల సమాచారం మేరకు బాచుపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాదకర ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu