TELANGANAPATRIKA (June 13) : MLAs meet Telangana CM. రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించినందుకు గుర్తుగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

MLAs meet Telangana CM పాల్గొన్న ఎమ్మెల్యేలు
ఈ సమావేశంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూర్), మందుల సామెల్ (తుంగతుర్తి), తోట లక్ష్మీకాంతరావు (జుక్కల్), కాలె యాదయ్య (చేవెళ్ల) వంటి ప్రతినిధులు పాల్గొన్నారు.
వారు ముఖ్యమంత్రి సమక్షంలో సామాజిక న్యాయం పట్ల తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర మంత్రుల హాజరు
ఈ సందర్భంగా మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కిన వాకిటి శ్రీహరి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశం మాదిగ వర్గం అభివృద్ధి, రాజకీయం లో ప్రాధాన్యత పెరగడం పట్ల విశేషంగా చర్చకు దారి తీసింది.
Read More: Read Today’s E-paper News in Telugu