Telanganapatrika (July 06): MLA sanjay, జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా శనివారం రోజంతా వేడుకలతో ఘనంగా నిర్వహించారు . ప్రజా నాయకుడి పట్ల అభిమానాన్ని చాటేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు:
జన్మదిన వేడుకలు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత దూరం వెళ్లాలని కోరుతూ ప్రత్యేక అభిషేకాలు, హారతులు నిర్వహించారు.
గాంధీ చౌక్ లో కేక్ కటింగ్:
తరువాత గాంధీ చౌక్ వద్ద అభిమానుల నడుమ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. భారీగా చేరిన యువత, నాయకులు సంబరాల్లో పాల్గొన్నారు.
MLA sanjay జన్మదినం సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ:
మానవత్వం చాటుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సామాజిక బాధ్యతగా ప్రజలతో కలిసి పండుగలా పుట్టినరోజు జరుపుకోవడం గర్వంగా ఉంది” అన్నారు.

పాల్గిన ప్రముఖులు:
ఈ వేడుకల్లో అనేక రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొన్నారు. వారిలో:
- మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు
- పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి
- మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి
- మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజారెడ్డి
- సీనియర్ నాయకులు కొండపల్లి రవీంధర్ రావు, కోల శ్రీనివాస్
ఇతర నాయకులు: బెజ్జంకి మోహన్, జనగోపి, వేణు, తిరుపతి గౌడ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu