
TELANGANA PATRIKA (MAY 17) , Minor Driving: మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై వాహన యజమానులపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.
Minor Driving మైనర్ల డ్రైవింగ్‌పై కఠిన ఆంక్షలు – తల్లిదండ్రులకు హెచ్చరిక
శనివారం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సోమవారం నుండి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్ చేయబడుతున్నట్లు మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇస్తే అటు ఓనర్లపైన ఇటు తల్లిదండ్రుల పైన కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే జరిగే ప్రమాదాల అంశంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వాహనాలు నడిపేందుకు కనీస వయస్సు లేని బాలబాలికలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదాలే కాదు, చట్టపరమైన చిక్కుల్లో కూడా పడే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రహదారి భద్రతలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండనీ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్య నేరమన్నారు. 18 ఏళ్లు నిండి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాహనాలు నడపాలనీ తెలిపారు. పిల్లల పట్ల ఇష్టాలు ఉంటే వారికి వాహనాలు ఇవ్వకుండా చదువులో మెరుగ్గా రాణించే విధంగా మోటివేషన్ చేయాలని అన్నారు. ఇప్పటికే మైనర్ల డ్రైవింగ్ పై దృష్టి సారించామని అన్నారు. భవిష్యత్లో మరింత కఠినతరం చేస్తామనీ, తల్లిదండ్రులు గమనించి పోలీసు వారికి సహకరించి మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా వాహనాలు ఇవ్వద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్ నాయక్, ఎస్సై రంజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read : Farmer support 2025 తడిచిన ధాన్యానికీ మద్దతు ధర – రైతుల కోసం పెద్ద నిర్ణయం!