Telanganapatrika (August 21): Minister Seethakka , తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. అంగన్వాడీల్లో పిల్లలకు త్వరలో అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Minister Seethakka సూచించారు ప్రతిరోజూ పాలు – వారంలో ప్రత్యేక బిర్యానీ
ఉదయాన్నే ప్రతి చిన్నారికీ 100ml పాలు సరఫరా చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అదనంగా వారంలో కనీసం ఒకరోజు పిల్లలకు ఎగ్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ అందించాలంటూ మంత్రి సూచించారు. దీని ద్వారా చిన్నారుల పోషకాహార లోపం తగ్గుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్లో విజయవంతమైన ప్రయోగం
హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ పథకం వల్ల అంగన్వాడీల్లో 30% అటెండెన్స్ పెరిగిందని మంత్రి సీతక్క వివరించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu