Telanganapatrika (August 20): Medaram Jathara 2025, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరు గాంచిన మేడారం మహాజాతర ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది.

Medaram Jathara 2025 భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు..
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తారు. భక్తుల రవాణా, వసతి, తాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. అదనంగా రహదారి విస్తరణ, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టనున్నారు.
ప్రతిష్టాత్మక గిరిజన ఉత్సవం..
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుండి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. నిధుల విడుదలతో ఏర్పాట్లు మరింత వేగవంతం కానున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu