Medaram Jatara child safety wristbands: మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివెళ్లనున్న నేపథ్యంలో, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంపుల్లో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు క్యూ ఆర్ కోడ్ ఆధారిత చైల్డ్ సేఫ్టీ రిస్ట్‌బ్యాండ్లు ను ప్రవేశపెట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను గోల్కొండ జోన్ డీసీపీ జీ. చంద్ర మోహన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు, MGBS అధికారులు పాల్గొన్నారు.
ఈ చైల్డ్ సేఫ్టీ రిస్ట్‌బ్యాండ్లులో పిల్లల పేరు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు, మొబైల్ నంబర్, నివాస చిరునామా వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ప్రతి రిస్ట్‌బ్యాండ్లుకు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఉంటుంది.
Medaram Jatara child safety wristbands ఎవైనా కారణాల వల్ల పిల్లలు తప్పిపోతే, అక్కడ ఉన్న పోలీసులు లేదా వాలంటీర్లు క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తక్షణమే పిల్లల వివరాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులను చేరవేయవచ్చు.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ – వోడాఫోన్ ఐడియా (VI) సంస్థతో కలిసి అమలు చేస్తోంది. మేడారం జాతరకు వెళ్లే తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అఫ్జల్‌గంజ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జాతర సమయంలో, ఈ రిస్ట్‌బ్యాండ్లు పిల్లల భద్రతకు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
