Medaram Jatara 2026, మేడారం మహాజాతర 2026 తేదీలు ఖరారు – జాతర విశేషాలు ఇవే! ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో పూజారుల సంఘం సమావేశమై ఈ కీలక తేదీలను ప్రకటించారు. ఈసారి మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు నాలుగు రోజులపాటు ఘనంగా జరగనుంది.

మేడారం జాతర 2026 – రోజువారీ షెడ్యూల్
జనవరి 28
సాయంత్రం సారలమ్మ అమ్మవారు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెకు చేరుకుంటారు.
జనవరి 29
సాయంత్రం సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంటారు.
జనవరి 30
భక్తులు మొక్కులు సమర్పించే పవిత్ర దినం.
జనవరి 31
సమ్మక్క – సారలమ్మ వనప్రవేశం, గోవిందరాజుతో కలిసి అడవిలోకి తిరిగి వెళ్తారు.
Medaram Jatara 2026 జాతర ప్రత్యేకతలు
- మేడారం జాతర రెండేళ్లకోసారి జరగుతుంది.
- లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు.
- ఇది గిరిజనుల ఆచార సంప్రదాయాల ప్రతిబింబం.
- సమాజం, ప్రకృతి, ధైర్యానికి నిదర్శనం.
- ప్రభుత్వం తరఫున భద్రత, వసతులు, రవాణా, వైద్య సదుపాయాలు సిద్ధం చేస్తారు.
గిరిజన గర్వంగా మారిన మేడారం
ఈ జాతర ద్వారా గిరిజనుల సంస్కృతి, ప్రకృతి ప్రేమ, సమాజ పట్ల చైతన్యం ప్రపంచానికి తెలియజేస్తారు. ఇది ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మ గౌరవానికి ప్రతీక.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!