Telanganapatrika (August 9): LIC Policy , ప్రతి తల్లిదండ్రుల కల – పిల్లలు మంచి చదువు చదవాలి, స్థిరమైన భవిష్యత్తు పొందాలి. కానీ ఆర్థిక ఇబ్బందులు చాలా సార్లు ఈ కలను దెబ్బతీస్తాయి. అలాంటి కుటుంబాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తున్న ప్రత్యేక పథకం “జీవన్ తరుణ్”.

LIC Policy జీవన్ తరుణ్ అంటే ఏమిటి…?
ఇది పిల్లల విద్య, భవిష్యత్తు ప్రణాళికలకు ఆర్థిక భద్రత కల్పించే లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పాలసీ.
పొదుపు + రక్షణ – ఈ రెండు ప్రయోజనాలు కలిపి అందిస్తుంది.
పాలసీదారుడు పిల్లల వయసు 25 సంవత్సరాలు పూర్తయ్యే వరకు నిర్ణీత కాలానికి పెట్టుబడి పెడతాడు.
చివరలో పెద్ద మొత్తాన్ని మెచ్యూరిటీగా పొందుతారు.
రోజుకు ₹150 పెట్టుబడి → ₹26 లక్షల ఫండ్…
- రోజుకు ₹150 పెట్టుబడి = నెలకు ₹4,500
- సంవత్సరానికి ₹54,000 పెట్టుబడి
- పిల్లల వయసు 1 సంవత్సరం ఉన్నప్పుడు పాలసీ ప్రారంభిస్తే → 25 ఏళ్లకు ముగుస్తుంది.
- చివరలో ₹26 లక్షల వరకు మెచ్యూరిటీ అమౌంట్.
- ఈ మొత్తంలో Sum Assured + వార్షిక బోనస్ + చివరి అదనపు బోనస్ ఉంటాయి.
LIC Policy పాలసీలో చేరడానికి వయోపరిమితి…
- కనీసం: 90 రోజులు వయస్సు ఉన్న పిల్లలు
- గరిష్టం: 12 సంవత్సరాలు వయస్సు
- 12 ఏళ్లకు మించి ఉంటే ఈ పాలసీ వర్తించదు.
పెట్టుబడి తిరిగి వచ్చే సమయం..
- పిల్లల వయస్సు 20 ఏళ్లు అయిన తర్వాత ప్రతి సంవత్సరం కొంత మొత్తం తిరిగి వస్తుంది.
- ఇది 24 ఏళ్ల వరకు కొనసాగుతుంది.
- 25వ ఏట మిగిలిన హామీ మొత్తం + అన్ని బోనస్‌లు కలిపి మెచ్యూరిటీ అమౌంట్ అందుతుంది.
LIC Policy అదనపు ప్రయోజనాలు..
పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పెట్టుబడిపై ట్యాక్స్ డిడక్షన్.
పన్ను రహిత రాబడి: సెక్షన్ 10(10D) ప్రకారం మెచ్యూరిటీ, మరణ ప్రయోజనాలు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ.
రుణ సౌకర్యం: పాలసీపై రుణం తీసుకునే అవకాశముంది.
Read More: Read Today’s E-paper News in Telugu