
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నష్టపోయిన రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రేవంత్ సర్కార్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం బాధితులకు పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపింది.
సహాయక చర్యల కోసం ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించారు. బాధితుల సమాచారం కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్లను (9912919545, 9440854433) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
