KTR phone tapping case: జనవరి 20న మాజీ నీటిపారుదల మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును SIT దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించింది. అనంతరం ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

SITపై కేటీఆర్ విమర్శలు
సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ విచారణను “డైలీ టీవీ సీరియల్‌లా మారింది” అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
సీనియర్ అధికారుల్ని ఎందుకు పిలవడం లేదని ప్రశ్న
ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను నిర్వహించిన సీనియర్ పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులను SIT ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత DGP శివధర్ రెడ్డి, మాజీ DGPలు మహేందర్ రెడ్డి, జితేందర్, రవి గుప్తా లాంటి వారిని పిలవకుండా కేవలం ప్రతిపక్ష నేతలకే నోటీసులివ్వడం రాజకీయ కక్షేనని విమర్శించారు.
KTR phone tapping case ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యం
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అప్పటి KCR నేతృత్వంలోని BRS ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిందన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సుమారు 600 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, లక్షకు పైగా కాల్స్‌ను గూఢచర్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆధారాల నాశనం ఆరోపణలు
ప్రభుత్వ మారిన తర్వాత కేసు నమోదవడంతో, ఆధారాలను నాశనం చేసేందుకు 17 హార్డ్‌డిస్కులను మూసీ నదిలో పడేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం
ఈ కేసులో హరీష్ రావుపై నమోదైన FIRను రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 5న సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించింది.
Read More: Read Today’s E-paper News in Telugu
