KITS College Chairman : తనపై కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని చూపించాలని, నిరాధార ఆరోపణలు చేస్తూ తన సంస్థలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న వారు ఆ చర్యలను ఇకనైనా మానుకోవాలని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అన్నారు. తనపై, తన కుటుంబం పై ఇటీవల కుటుంబం పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా మార్గం మధ్యలో హత్యాయత్నం జరిగిన నేపద్యంలో ఆయన బుధవారం కోదాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006కి పూర్వం తాను వ్యాపారవేత్తననీ తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఆ సమయంలో కోదాడ ఈ వీ రెడ్డి డిగ్రీ కాలేజ్ నిర్వాహకులు గింజల రమణా రెడ్డి తన వద్దకు వచ్చి తమ విద్యా సంస్థలు దివాలా తీస్తున్నాయని, వాటిని రక్షించేందుకు అప్పు కావాలని తన దగ్గరకు వచ్చారన్నారు.

ఈ క్రమంలోనే అప్పు పెరిగిపోయి చివరకు అప్పు తీర్చేందుకు పెట్టుబడిగా మార్చాలని కోరడంతో తాను కూడా విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల ఉపాధి అవకాశాలు దెబ్బ తినకుండా ఉండేందుకు దాన్ని పెట్టుబడి గా మార్చానన్నారు. అప్పటి కాలేజీ నిర్వహణ వారు చూశారనీ, తన తెలియకుండానే అనుమతుల కోసం కొన్ని తప్పుడు పత్రాలు సృష్టించారని వాటితోనే అనుమతులు తెచ్చారన్నారు. కాలేజీ నిర్వహణ లో కొన్ని లోపాలు గమనించడంతో తాను ఇదేమిటని అడగటంతో వారు కళాశాల నిర్వహణ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి వెళ్లిపోయారన్నారు. నాటినుండి నేటి వరకు అదే పనిగా ఆరోపణలు చేస్తూ తన విద్యా సంస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వారు చేసే ఆరోపణలపై గతంలో తాను జెఎన్టియు , ఎ సి టి యు అధికారులకు వివరించానని దానితో వారు సంతృప్తి చెందారన్నారు.
అదే విధంగా కొమరబండలోని రామ్ కో మిల్లు యజమాని వెంపటి వెంకటేశ్వర రావు కూడా వచ్చి అప్పుల బారి నుండి కాపాడాలని కోరాడని అన్నారు. ఆయనకు కూడా ఆర్థిక సహాయం చేసి కాపాడాననీ చెప్పారు. తరువాత కాలంలో తమ సంస్థలు బాగా నడవడం తో అసూయ చెందిన వారు తనపై గత 15 ఏళ్లుగా ఆరోపణలు లేని ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చివరకు తనపై కక్ష పెంచుకొని తనను తన కుటుంబాన్ని అంతం చేసేందుకు హత్యాయత్నం చేశారన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న రమణా రెడ్డి ఈనెల 7వ తేదీన ,వెంపటి వెంకటేశ్వర రావు 8వ తేదీన లు కొమరబండలోని వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ వద్ద చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు