Telanganapatrika (July 29): KGBV , జూలై 30, 31 తేదీలలో కేజీబీవీ లో ఇంటర్మీడియట్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఉన్న 8 కస్తుర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ వివిధ కోర్సులకు, అంతర్గాం లో 10 బై.పి.సీ, జూలపల్లి లో 15 బై.పి.సి, మంథని ముత్తారం లో 16 సీఈసీ, 19 ఎం.పి.హెచ్.డబ్ల్యూ , ఓదెల లో 18 ఎం.పి.సి , 27 బై.పి.సి, పాలకుర్తిలో 19 ఎం.ఎల్.టి, 19 బై.పి.సి , రామగిరి లో 10 ఎం.పి.సి, కంప్యూటర్ సైన్స్ 25, శ్రీరాంపూర్ లో 20 సి.ఈ.సి, 2 ఎం.పి.హెచ్.డబ్ల్యూ, సుల్తానాబాద్ లో 21 ఎం.పి.హెచ్.డబ్ల్యూ సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఆసక్తిగల విద్యార్థులు నేరుగా జూలై 30, 31న స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu