Telanganapatrika (August 3): ఎమ్మెల్సీ కవిత , నల్గొండ జిల్లాలో BRS పార్టీని దెబ్బతీసిన నేతపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. “ఆ నాయకుడు BRSను నాశనం చేశాడు… అతను లిల్లీఫుట్ లాంటి వాడు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా ఎవరినీ ప్రస్తావించకపోయినా, ఆ వ్యాఖ్యలు మంత్రి జగదీశ్ రెడ్డి పై అయివుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నల్గొండను నాశనం చేసిన లిల్లీఫుట్ ఎవరు..? –ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
నల్గొండ జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జగదీశ్ రెడ్డే గెలవగా, మిగిలిన స్థానాలన్నీ పార్టీకి నష్టమే వచ్చాయి. ఈ నేపథ్యంలో, “నేను నా సీట్లో గెలిచాను. కానీ నల్గొండ జిల్లాలో మిగతా ఓటములకు ఆ నాయకుడే కారణం” అని కవిత వ్యాఖ్యానించడం, కొద్దిరోజుల క్రితమే ఆమెపై జగదీశ్ రెడ్డి విమర్శలు చేసిన సందర్భాన్ని గుర్తుకు తెస్తోంది.
ఇది కేవలం నేతల మధ్య మాటల యుద్ధమేనా? లేక బహిరంగ విమర్శలకు అంతర్గత కలహమా? అనేదిపై చర్చలు సాగుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu