Telanganapatrika (July 13) :Karimnagar Bonalu Festival 2025 – కరీంనగర్ లో పోచమ్మతల్లి భోనాల జాతర ఘనంగా సాగింది. బీజేపీ నేత సునీల్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Karimnagar Bonalu Festival 2025
కరీంనగర్ లో ఘనంగా పోచమ్మతల్లి భోనాల జాతర డప్పుచప్పల్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల వేషాలు, బోనాలెత్తిన మహిళలతో ఆషాడమాసంలో పోచమ్మతల్లి భోనాలు అట్టహాసంగా సాగాయని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.
కళ్ళుషాక, కోడి పుంజు యాటలతో మొదటి మొక్కులు అందుకునే పొలిమేర దేవత పోచమ్మతల్లి భోనాల జాతర కరీంనగర్ నగరంలో ఘనంగా జరిగింది. ఈ జాతరకు భగత్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బీజేపి నేత మాజీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు నెత్తిన బోనమెత్తి ఊరేగింపును ప్రారంభించారు. మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం పెద్దలు సునీల్ రావు ని శాలువాలతో సత్కరించారు.
భగత్ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని సునీల్ రావు అన్నారు.
పోచమ్మతల్లి, పెద్దమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, మైసమ్మతల్లి, మహాకాళి అమ్మవార్లకు ఇలా భోనాలు, కళ్ళు శాఖలతో ప్రజలు మొక్కులు చెల్లించుకోవడం తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు.
మునుపటి పద్ధతుల ప్రకారం, ప్రతి శుభకార్యం ప్రారంభానికి ముందుగా పోచమ్మతల్లిని కొలవడం ఆనవాయితీగా ఉందని వివరించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, పంటలు పండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ భోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పోచమ్మతల్లి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో:
వెంకన్న (అధ్యక్షుడు), రవీంధర్ (ఉపాధ్యక్షుడు), తోట వెంకట రాములు, కర్ర సత్తయ్య, అంజనేయులు, ఉపేందర్, వెంకటరావు, రాజ్ ప్రభాకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Karimnagar Municipality – Click Here
- Pochamma Temple Karimnagar- Click Here
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.