Advertisement

Karikaveni Kuntayya Police Complaint Siricilla : కుంటయ్య ఆరోపణలు అసత్యం.., సీఐ మొగిలి క్లారిటీ..!

TELANGANAPATRIKA (June 19): Karikaveni Kuntayya Police Complaint Siricilla. తంగళ్లపల్లి మండలం, అంకుషాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కరికవేణీ కుంటయ్య ఇటీవల ఆత్మహ*త్యకు పాల్పడిన ఘటనపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు అసత్యమని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Karikaveni Kuntayya Police Complaint Siricilla పోలీసుల తక్షణ స్పందన

కరికవేణీ కుంటయ్య చేసిన ఫిర్యాదు మేరకు, తేదీ: 25.08.2023న తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో మల్యాల నాగరాజుపై ఫిర్యాదు నమోదై, వెంటనే Cr.No.278/2023 U/s 420, 384 r/w 511, 506 IPC కింద కేసు నమోదు చేశారు. తగిన ఆధారాలు సేకరించి, దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ న్యాయస్థానంలో దాఖలయ్యింది.

Advertisement

రెండవ కేసు వివరాలు
అలాగే, తేదీ: 12-12-2024న మరో భూ వివాదంలో కరికవేణీ కుంటయ్యపై గంగా కిష్టరెడ్డి చేసిన ఫిర్యాదుపై Cr.No.427/2024 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం చార్జ్ షీట్ దాఖలయిందని తెలిపారు.

పోలీసులపై తప్పుడు ప్రచారం
ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించలేదని జరుగుతున్న ప్రచారం తప్పుడు వదంతులేనని, సీరియస్ నేరాల విషయంలో పూర్తిగా చట్టబద్ధంగా స్పందించారని రూరల్ సీఐ మొగిలి స్పష్టం చేశారు.

భూ వివాదాలపై స్పష్టత
భూములకు సంబంధించిన వివాదాలు సివిల్ నేచర్ కావడంతో, పోలీసులు చట్టపరంగా ముద్దులో పడకుండా, ప్రజలు న్యాయస్థానాల్లో పరిష్కరించుకోవాలని తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.