TELANGANA PATRIKA(JUN 6) ,Kamareddy Police , కామారెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ విధులకు గైర్హాజరవుతున్న సిబ్బందిపై కామారెడ్డి పోలీస్ బాస్ కన్నెర్ర చేస్తున్నారు. చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసేందుకు వెనుకాడట్లేదు. నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ సస్పెన్షన్ మరువకముందే అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు.

Kamareddy Police , కానిస్టేబుల్ రాకేష్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాకేష్ గౌడ్ ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. 5వ తేదీన
పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవింగ్ – ప్రమాదానికి దారి తీసింది!
డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఎస్సై ఇచ్చిన నివేదిక ఆధారంగా శుక్రవారం రాకేష్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పోలీసులు బాధ్యతారహిత ప్రవర్తన, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు
Read More: Read Today’s E-paper News in Telugu