kakatiya university gold medalist 2025, జగిత్యాల తారకరామా నగర్ కి చెందిన నేరెళ్ల సింధుకృష్ణ కాకతీయ యూనివర్సిటీ నుండి పీజి ఎం ఏ ఎకనామిక్స్ విభాగంలో 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. కాకతీయ యూనివర్సిటీలో 2019 లో పీజీ పూర్తి చేసిన సింధుకృష్ణ యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది. దానితో పాటు ఎకనామిక్స్ విభాగంలో 3 వేరు వేరు అంశాలలో తను చేసిన పరిశోధనకు గాను 3 గోల్డ్ మెడల్స్ సాధించింది.
తమ కూతురు గోల్డ్ మెడల్స్ సాధించడం పట్ల సింధు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. నిన్న జరిగిన కాకతీయ యూనివర్సిటీ 23 వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. సింధు కృష్ణను ధర్మశాస్తా అకాడెమి డైరెక్టర్ స్వరాజ్ కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.
kakatiya university gold medalist 2025:

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!