Telanganapatrika (July 28): ముదురుతున్న జగిత్యాల రాజకీయం , జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి హౌసింగ్ కాలనీలో నెలకొన్న తాజా పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తలుపులు తెరిచాయి. ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత అంశం వల్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ముదురుతున్న జగిత్యాల రాజకీయం నూకపల్లి హౌసింగ్‌లో 2000 ఇండ్ల కూల్చివేత..
జీవన్ రెడ్డి ప్రకారం – 2000 ఇండ్లను పూర్తి సమాచారం లేకుండా కూల్చేయడం అన్యాయమని, లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఇది అభివృద్ధి పేరుతో జనం మీద దాడి అని ఆయన అభిప్రాయం.
ఇక ఎమ్మెల్యే సంజయ్ మాత్రం తేల్చి చెప్పారు – “అభివృద్ధికి సహకరించండి, అడ్డుగా రాకండి”. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి, సంజయ్ కలిసి పనిచేస్తారా లేదా అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది.
Read More: Read Today’s E-paper News in Telugu