TelanganaPatrika(jun 8):Jagtial MLA , జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.85 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, పుష్పగుచ్ఛం అందజేసి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

మొత్తం రూ.85 కోట్ల నిధుల మంజూరు
- జగిత్యాల పట్టణంలో నూతనంగా విలీనం అయిన ప్రాంతాలకు రూ.20 కోట్లు
- జగిత్యాల పట్టణానికి ప్రత్యేక గ్రాంట్ కింద రూ.50 కోట్లు
- రాయికల్ మున్సిపల్ అభివృద్ధికి రూ.15 కోట్లు
- మొత్తంగా రూ.85 కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి మంజూరయ్యాయి.
Jagtial MLA మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల వినియోగం
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులను ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావర్ రోడ్ విస్తరణ, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu