Telanganapatrika (July 14) : Indur Ura Panduga 2025 , ఇందూరు జిల్లా లో ఉర పండగ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దీంతో ఇందూర్ లోని పలు వీధుల్లో పులోరియా అంటూ భక్తుల నినాదాలతో హోరెత్తింది.. ఇందూర్ నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఊర పండగ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో తేలు మైసమ్మ గద్దె నుంచి దేవతామూర్తుల ప్రతిష్టాపనకు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా కదిలాయి. జిల్లా అధికార యంత్రంగం పర్యవేక్షణలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య పూర పండుగ సంబరాలు షురూ అయ్యాయి.
తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ,కొండల రాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం పెద్దపులి ప్రతిమలను వేడుకగా ఊరేగించారు ఊరేగింపు పెద్ద బజార్, కోట గల్లి,జండగల్లి, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాలలో అమ్మవార్లను ప్రతిష్టించేందుకు ఊరేగింపు కొనసాగుతోంది జొన్నలు, పసుపు, కుంకుమలతో చేసిన సరి క్లస్టర్ ఊరేగిస్తూ ఊరేగింపు సందర్భంగా పంపిణీ చేశారు.
భక్తులు దారి పొడవునా మేకలు కోళ్లను బలిస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. నగరంలోని వీధుల వెంట పూల పండుగ దృశ్యాలు సంబరంగా కనిపించడం విశేషం. నగరంలో అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా భక్తులు అమ్మవారు ఆవహించిన పూనకాలతో ఊగిపోయారు. పులోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ అమ్మవార్ల ఊరేగింపు ప్రతిష్టాపన సాయంత్రం వరకు కొనసాగుతుంది.రాజకీయనాయకులు బలమూరి వెంకట్ ,నుడా చైర్మన్ కేసు వేణు, ఎమ్ ఎల్ ఏ సూర్యనారాయణ,కాంగ్రెస్, బీజేపీ, బి ఆర్ ఎస్,నాయకులూ ఉన్నతాధికారులు భక్తులు పోతురాజుల వీరంగాలతో పండగ అంబరాన్న్ని అంటింది.
Indur Ura Panduga 2025:
