తెలంగాణ పత్రిక (MAY 01) , indiramma indlu 2025: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గురువారం ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను రాఘవపట్నం గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, అధికారులను నిర్మాణ పనుల వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ indiramma indlu 2025 హౌసింగ్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత:
మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రభుత్వం గూడు లేని పేదల కలల గుడిసె సాకారం చేసేందుకు ఇందిరమ్మ పథకాన్ని పురోగతిలోకి తీసుకువచ్చిందని అన్నారు. మంజూరైన ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, రెండవ దశ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇచ్చి వారి నివాస కల నెరవేరేలా చూడాలన్నారు. ఇసుక సరఫరా సంబంధిత ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
లబ్ధిదారులతో నేరుగా చర్చ
నిర్మాణంలో పాల్గొంటున్న పొన్నం రవీందర్, ధనసరి లింగయ్య, కృష్ణ వేణి, కోరం రామ్ మోహన్ లతో మంత్రివర్యులు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నివాస అవసరాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రతి దశలో ఇందిరమ్మ హౌసింగ్ యాప్లో నమోదు చేయాలని అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu