Telanganapatrika (August 19): Indiramma Indlu, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల కల నిజమవుతోంది. ఇప్పటికే నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి గృహప్రవేశాలను స్థానిక ఎన్నికలకు ముందే ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడం కూడా కొనసాగుతోంది.

Indiramma Indlu గృహప్రవేశాల్లో సీఎం పాల్గొననున్నారు..
ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి అశ్వారావుపేటలో నిర్వహించనున్న గృహప్రవేశ వేడుకలో పాల్గొననున్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. సర్కార్ ఈ వేడుకలను ప్రజలతో నేరుగా మమేకం అయ్యే అవకాశంగా మలచుకుంటోందని అధికారులు తెలిపారు.
ఎన్నికల ముందు ప్రజాకర్షణ యత్నం
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ఎన్నికల దృష్ట్యా కీలక కార్యక్రమాలుగా భావిస్తున్నారు. పేదల కలల ఇళ్లలో ముఖ్యమంత్రి గృహప్రవేశం చేయడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశ్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu