TELANGANA PATRIKA (MAY 14) , Indiramma housing scheme beneficiaries Telangana పథకం కింద లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలోని వార్డ్ నెం.1 లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ, మార్కింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎంతో మేలైనది. లబ్ధిదారులు ఇండ్లు త్వరగా నిర్మించుకుని తొలి విడతగా ఒక లక్ష రూపాయల సాయం పొందాలి,” అని సూచించారు.
Indiramma housing scheme beneficiaries Telangana మంజూరు చేయబడిన ఇళ్ళు
అడ్లూర్ గ్రామానికి చెందిన గండ్ల హేమలతకు ఈ పథకం కింద 575 స్క్వేర్ ఫీట్ల స్థలంలో ఇండ్ల నిర్మాణం కోసం మంజూరు ఉత్తర్వులు అందజేశారు. హేమలత మాట్లాడుతూ, “నా భర్త మృతి చెందిన తర్వాత ఇద్దరు పిల్లలతో బీడీలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఈ ఇంటి మంజూరు నా కుటుంబానికి ఎంతో మద్దతు,” అని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి అర్హులైన లబ్ధిదారుడు ఇందిరమ్మ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని బేస్మెంట్ స్థాయి వరకైనా త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వం సొమ్ము విడుదల చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌసింగ్ పిడి జైపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Also Read : Telangana revenue minister visit arrangements: కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను సమీక్షించారు
Comments are closed.