Advertisement

Indiramma Housing Grounding Progress : ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి: కలెక్టర్ హైమావతి..!

TELANGANAPATRIKA (June 21): Indiramma Housing Grounding Progress . ఇందిరమ్మ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను 10 రోజుల్లో గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి గారు అధికారులను ఆదేశించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

Indiramma Housing Grounding Progress ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష

శనివారం రోజున సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement

లబ్ధిదారుల స్థితిగతులపై సమీక్ష

మొదటి విడతలో గ్రౌండింగ్ అయిన ఇళ్ల స్థితిగతులను అడిగి, ఇంకా ప్రారంభించని వారితో చర్చించారు. నిర్మాణం ఆలస్యం అయ్యే కారణాలను తెలుసుకొని, ఆర్థికంగా వెనుకబడినవారిని ఎంపీడీవో ద్వారా మరింత ముందుకు తేవాలని సూచించారు. నిర్మాణానికి ఆసక్తి లేని లబ్ధిదారుల నుంచి అధికారికంగా ఇంటి అవసరం లేదని లేఖ తీసుకోవాలని చెప్పారు.

గ్రామాల వారీగా లబ్ధిదారులపై నిఘా

ఫేస్-2 లో శాంక్షన్ అయిన ఇండ్ల నిర్మాణాన్ని సోమవారం నుండి 10 రోజుల్లో ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ప్రతి లబ్ధిదారుని ఇంటి స్థలంపై మార్కింగ్, ముగ్గు వేయించడం జరగాలని సూచించారు.

ఉచిత ఇసుక, పేమెంట్ నమ్మకం

ఉచిత ఇసుక పంపిణీకి తహసిల్దార్లు టోకెన్లు అందించనున్నారని కలెక్టర్ గారు తెలిపారు. పేమెంట్ ప్రక్రియలు పారదర్శకంగా ఉండాలని, పూర్తయిన ఇళ్లకు నిధులు విడుదలైన తర్వాత ఇతర లబ్ధిదారుల నమ్మకం పెరగేలా చూపించాలన్నారు.

హెచ్చరికలు, సూచనలు

  • లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడులు, ప్రలోభాలు ఉండకూడదు
  • నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు అధికారులకు తెలియజేయాలి
  • రాష్ట్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయాలి
  • ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారి దామోదర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.